![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -127 లో.. రాహుల్, రుద్రాణి ఇద్దరు కావ్యపై కోపంగా ఉంటారు. వెన్నెలతో పెళ్ళి అయి ఉంటే కోట్ల ఆస్తి మన సొంతం అయ్యేది.. వెన్నెలతో పెళ్లి కాకుండా చేసిన ఆ అక్క చెల్లెల్లను ఇంట్లో నుండి పంపించేయాలని రాహుల్ అంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు స్వప్న ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని రుద్రాణి అంటుంది.
మరొక వైపు స్వప్న నిద్ర నుండి లేచి కిందకి వస్తుంది. హాల్లో అందరు కూర్చొని ఉండగా స్వప్న ఏదో మహారాణి అయినట్లు ధార్జగా సోఫాపై కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. సుభాష్ దగ్గర ఉన్న పేపర్ లాక్కొని చదువుతుంది. అలా స్వప్నని చుసిన దుగ్గిరాల ఫ్యామిలీ.. ఏంటీ ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుంటారు. ఏంటి ఇప్పుడా లేవడం అని స్వప్నతో ఇందిరాదేవి అంటుంది. మా ఇంట్లో నేను పదకొండు వరకు లేవనని స్వప్న అంటుంది. బయట కావ్య ముగ్గు వేస్తుంటే చూసి.. మీ చెల్లి కూడా ఆ ఇంటి నుండి వచ్చింది కదా మరి మీ చెల్లి ఎలా పద్ధతిగా ఉందో చూడని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే కావ్య వచ్చి.. అక్క ఎందుకు అలా బెహేవ్ చేస్తున్నావ్? లోపలికి వెళ్ళమని అంటుంది. నేను ప్రొద్దున్నే బెడ్ కాఫీ తాగుతానని తెలియదా వెళ్లి తీసుకొని రా అని కావ్యని అంటుంది. కావ్య వెళ్లి కాఫీ తీసుకొని వచ్చి స్వప్నకి ఇస్తుంది. ఏంటీ ఇది కాఫీ నా? నేను స్ట్రాంగ్ కాఫీ తాగుతా అని తెలియదా వెళ్లి మళ్ళీ తీసుకొని రా అని స్వప్న చెప్పేసి పైకి వెళ్తుంది. స్వప్న అలా ప్రవర్తిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. కస్వప్న దగ్గరికి కావ్య వెళ్లి.. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు అలాగేనా ప్రవర్తించిదని స్వప్నని తిడుతుంది కావ్య. "నిన్ను ఈ ఇంట్లో పనిమనిషిని చేశారు. నీలాగా నేను ఉండలేను. ఈ దుగ్గిరాల ఇంటి కోడలిగా గౌరవంగా ఉంటాను" అని స్వప్న అంటుంది. ఉంటే ఉండు కానీ నీ కడుపుపై ఎవరికీ డౌట్ రాకుండా చూసుకోమని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. కావ్య బయటకు వచ్చేసరికి డోర్ దగ్గర రాజ్ ఉంటాడు. రాజ్ నేను మాట్లాడిందంతా విన్నాడా అని కావ్య బయపడుతుంది. కానీ రాజ్ సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
మరొక వైపు ఇంటి పత్రాలు సేట్ దగ్గర నుండి తీసుకొని రావడానికి కనకం మీనాక్షిని తీసుకొని సేట్ దగ్గరికి వెళ్తుంది. సేటు ఇంట్లోకి మీనాక్షిని ఒక్కదాన్నే పంపించి కనకం బయట ఉంటుంది. మీనాక్షి వెళ్లి.. నీకు కనకం డబ్బులు కట్టి పత్రాలు విడిపించుకోవడానికి నన్ను తీసుకొని రమ్మంది. పత్రాలు తీసుకొని రండి వెళ్తానని మీనాక్షి అనగానే.. సేటు బయల్దేరుతాడు. మరొక వైపు టిఫిన్ చేయడానికి అందరు వస్తారు. నన్ను పిలువలేదని స్వప్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |